ETV Bharat / jagte-raho

దంపతుల హత్య కేసులో నిందితుల అరెస్ట్​

author img

By

Published : Jun 10, 2020, 7:41 PM IST

ఎనిమిది గుంటల భూమి రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ భూమిని దున్నే క్రమంలో గొడవ జరిగి జంట హత్యలకు దారి తీసింది. కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం కొండపాకలో జరిగిన జంట హత్యలకు భూ వివాదమే కారణమయింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

accused arrest in double murder case in karimnagar district
దంపతుల హత్య కేసులో నిందితుల అరెస్ట్​

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొండపాకకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పూరెల్ల సుశీల ఆమె భర్త పోశాలు మంగళవారం హత్యకు గురయ్యారు. ఈ సంఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఓదేలు, హనుమంతు, రాజేశ్​ను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

దంపతుల హత్య కేసులో నిందితుల అరెస్ట్​

భూ వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు చెప్పారు. గత 20 సంవత్సరాలుగా 8 గుంటల భూమి విషయంలో నిందితులు, మృతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయమై ఇరువర్గాలపై వీణవంక పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. భూమి విషయమై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.

ఈ భూమిని పోశాలు దున్నేక్రమంలో ముగ్గురు నిందితులు గొడ్డలి, కత్తులతో దాడి చేసినట్లు అదనపు డీసీపీ తెలిపారు. పోశాలుపై దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుశీల అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడ హతమార్చినట్లు వెల్లడించారు.

ఇవీచూడండి: సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి.. పోలీసుల గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.