జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో పందిని ఢీకొని ఒకరు మృతి చెందగా. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ధరూరు మండలం యములోనిపల్లి గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు పని కోసం ఆటోలో రేపల్లె గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే పంది ఒక్కసారిగా అడ్డు వచ్చి పందిని ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది.
ఘటనలో అడివమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరో ఐదుగురిని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. రుణ మంజూరులో ఆలస్యం.. వీధి వ్యాపారుల పాలిట శాపం