మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న హన్మంతరావు నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గతంలో సూర్యాపేట మున్సిపాలిటీలో పని చేస్తున్న సమయంలో మిగిలిపోయిన బిల్లుల మంజూరు కోసం గుత్తేదారును డబ్బులు డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని గుత్తేదారు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కన ఉన్న ఇండోర్ స్టేడియం వద్ద హన్మంతరావు నాయక్ రూ. 2.25 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు