ETV Bharat / jagte-raho

ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు రూ. 70 కోట్లు! - hyderabad latest news

అవినీతి నిరోధక శాఖ మరో భారీ కేసును ఛేదించింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి ఏసీపీ యలమకూరి నర్సింహారెడ్డికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల గుట్టును రట్టు చేసింది. దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించింది. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ఆయన ఇంటికి తెల్లవారుజామునే చేరుకున్న ఏసీబీ బృందం రాత్రి వరకు తనిఖీలు చేసింది.

ACB searches in the homes of ACP Narsinghareddy in telangana and ap
ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు రూ. 70 కోట్లు!
author img

By

Published : Sep 24, 2020, 8:50 AM IST

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి ఏసీపీ యలమకూరి నర్సింహారెడ్డికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల గుట్టును రట్టు చేసింది ఏసీబీ. దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించింది. స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లోని బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లల్లో సోదాలు చేసింది. సుమారు రూ. 7.5 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్యాంకు లాకర్‌ తెరిస్తే ఏమైనా ఆధారాలు దొరకవచ్చని భావిస్తున్నారు.

వారసత్వమంటూ గిఫ్ట్‌డీడ్‌లు..

నర్సింహారెడ్డి తన అక్రమార్జనతో ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు గిఫ్ట్‌డీడ్‌లతో మాయాజాలానికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తుల్ని బినామీలుగా ఏర్పాటు చేసుకొని వారి పేరిట సైబరాబాద్‌ ప్రాంతంలో ఆస్తుల్ని కొన్నట్లు గుర్తించారు. బినామీలకు 2016లో ఒకేసారి వారి పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులు దక్కినట్లుగా గిఫ్ట్‌డీడ్‌లు సృష్టించినట్లు ఆధారాలు సేకరించారు. ఆ స్థలాలు శేరిలింగంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఉన్నా.. అక్కడ కాకుండా ఎల్‌బీ నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి లింక్‌ డాక్యుమెంట్లు వంటి ఆధారాలేవీ లేకపోవడం గమనార్హం.

చెట్లకు నీళ్లుపోసే వ్యక్తి పేరిటా ఆస్తులు!

బినామీల ఆదాయాలపై ఏసీబీ ఆరా తీయగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నార్సింగి ప్రాంతంలో రూ. 15,000 జీతానికి చెట్లకు నీళ్లు పోసే పనిచేస్తున్న ఓ వ్యక్తి నర్సింహారెడ్డికి బినామీగా ఉండటంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. మరోవైపు నర్సింహారెడ్డి.. స్వగ్రామమైన అనంతపురం జిల్లా పూలఓబయ్యపల్లిలో తన పేరిట సుమారు 5 ఎకరాలు, కుటుంబసభ్యుల పేరిట అదే జిల్లా మరువపల్లి అగ్రహారంలో దాదాపు 50 ఎకరాల్ని సమకూర్చుకున్నట్లు గుర్తించారు.

హోటల్‌.. స్థిరాస్తి వ్యాపారం

నర్సింహారెడ్డి పోలీస్‌శాఖలో ఉంటూనే అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పలు వ్యాపారాలు చేసినట్లు తేలింది. ఉప్పల్‌ ప్రాంతంలో గతంలో ఒక మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తన పలుకుబడితో వ్యాపారం చేసినట్లు గుర్తించారు. అలాగే తన కుటుంబసభ్యుల పేరుతో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. పెద్దఅంబర్‌పేట ప్రాంతంలో సుమారు ఎకరం స్థలంలో హోటల్‌ ఏర్పాటు చేసినట్లు.. అందుకోసం రూ. 90 లక్షల రుణం తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్‌ వ్యాపారం సరిగా నడవకపోవడంతో వేరే వ్యక్తులకు అప్పగించానని నర్సింహారెడ్డి ఏసీబీకి చెప్పినట్లు తెలిసింది.

25 చోట్ల సోదాలు..

  • నర్సింహారెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. స్వగ్రామమైన అనంతపురం జిల్లా పూలఓబయ్యపల్లిలో భూమి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిడిగల్లు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఆయన భూమి కొన్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని ఆయన సోదరుడు నారాయణరెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రియాలలో ఎర్ర చంద్రశేఖర్‌తో ఏసీపీ నర్సింహరెడ్డి లావాదేవీలు నిర్వహించారన్న ఆరోపణల మేరకు చంద్రశేఖర్‌ సోదరుడైన లక్ష్మణ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపింది.
  • కరీంనగర్‌ జిల్లా గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్‌ ఇంట్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ శివారులో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో నర్సింహరెడ్డితో మధుకర్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానంతో సోదా చేసిన ఏసీబీ అధికారులు విలువైన పత్రాౖలను స్వాధీనం చేసుకున్నారు.
  • జనగామ జిల్లా వడ్డిచర్లలో ఏసీపీ నర్సింహారెడ్డి మామ మోతె నర్సింహారెడ్డి ఇంట్లో, రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో తిరుపతిరెడ్డి, బచ్చన్నపేట మండలం కట్కూరులో చంద్రారెడ్డి నివాసాల్లో సోదాలు చేపట్టారు.

ఆమె’ ఎవరు?

మాదాపూర్‌ ప్రాంతంలో ఉండే ఓ మహిళ పేరిట నర్సింహారెడ్డి కొన్ని ఆస్తుల్ని కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె తమ కుటుంబానికి సన్నిహితురాలని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో కలిసి నర్సింహారెడ్డి గతంలో వ్యాపారాలు సాగించారనే కోణంలోనూ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇక్కడి నుంచి మహారాష్ట్రకు మకాం మార్చినట్లు తెలిసింది. సోదాల అనంతరం ఆయన మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

అక్రమాస్తుల చిట్టా..

  • అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
  • మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలో 1,960 చదరపు గజాల మేర నాలుగు ప్లాట్లు
  • హఫీజ్‌పేటలో మూడంతస్తుల వాణిజ్య భవనం, 2 ఇతర ప్లాట్లు
  • రూ. 15 లక్షల నగదు
  • 2 బ్యాంకు లాకర్లు
  • స్థిరాస్తి, ఇతర వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడుల దస్త్రాలు

ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.