అవినీతి నిరోధక శాఖ వలకి అవినీతి తిమింగలం చిక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిత లంచం తీసుకుంటుండగా అనిశాకి చిక్కారు. సెక్షన్ అధికారి శ్రీనివాస్ నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితురాలు అనితను వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: సిగ్నల్ పడిందా... హమ్మయ్య సేదతీరొచ్చు!