ETV Bharat / jagte-raho

నర్సాపూర్‌ లంచం కేసులో ఏసీబీ విచారణ

author img

By

Published : Sep 21, 2020, 1:36 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లంచం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. చంచల్‌గూడ జైలులోని ఐదుగురు నిందితులను కస్టడిలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం, జీవన్‌గౌడ్‌ను బంజారాహిల్స్‌లోని అ.ని.శా. కార్యాలయంలో 4 రోజులపాటు విచారణ చేయనున్నారు.

ACB is probing the Narsapur bribery case in hyderabad
నర్సాపూర్‌ లంచం కేసులో ఏసీబీ విచారణ

నర్సాపూర్ లంచం కేసులో ఐదుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం, జీవన్‌గౌడ్‌ను బంజారాహిల్స్​లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి అదనపు కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షలు తీసుకున్నాడు.

ఇందులో 40 లక్షల రూపాయలు నగదు గాను.. మిగతా 72 లక్షల రూపాయలకు ఐదు ఎకరాల భూమిని తన బినామీ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకున్నాడు. బాధితుడు లింగమూర్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి ఆధారాలు సమర్పించటంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. దర్యాప్తులో పురోగతి కోసం ఐదుగురు నిందితులను అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

నిషేధిత చట్టం కింద ఉన్న ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా మాజీ కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయటంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లంచం కేసులో ఎవరి పాత్ర ఉందని దానికి సంబంధించి నిందితులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు న్యాయస్థానం నిందితులను కస్టడీకి అనుమతించింది. మొదటి రోజు విచారణలో భాగంగా నిందితులకు పీపీఈ కిట్లు వేసి కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: కామారెడ్డి మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.