ETV Bharat / jagte-raho

ఏసీబీకి చిక్కిన వరంగల్​ ఎంజీఎం అటెండర్

ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రి అటెండర్ అడ్డంగా దొరికిపోయాడు. మెడికల్​ సర్టిఫికెట్​పై సివిల్​ సర్జన్​ సంతకం పెట్టించేందుకు రూ.1500 డిమాండ్ చేశాడు.

ACB catched attender in warangal MGM hospital to taking amount for medical certificate
ఏసీబీకి చిక్కిన వరంగల్​ ఎంజీఎం అటెండర్
author img

By

Published : Nov 27, 2020, 3:32 PM IST

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో అటెండర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అవినీతి బాగోతం బట్టబయలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి మెడికల్​ సర్టిఫికెట్ కోసం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య ధ్రువపత్రంపై సివిల్​ సర్జన్​తో సంతకం పెట్టించేందుకు అటెండర్ శ్రీకాంత్ రూ.1500 డిమాండ్ చేశాడు.

లంచం ఇవ్వడం ఇష్టంలేని సమ్మయ్య అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం అటెండర్ డబ్బులు తీసుకుంటుండగా అతన్ని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కేసీఆర్​ దృష్టికి ఆర్యవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు అంశం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.