ETV Bharat / jagte-raho

మొన్న నాగరాజు​.. నిన్న ధర్మారెడ్డి.. నిందితుల బలవన్మరణాలు

అనిశా కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

acb cases accused's committed consecutive suicides
మొన్న నాగారాజు​.. నిన్న ధర్మారెడ్డి.. బలవన్మరణాలకు పాల్పడుతున్న నిందితులు
author img

By

Published : Nov 8, 2020, 5:46 PM IST

ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్న అవినీతి తిమింగలాలపై అనిశా అధికారులు కొరడా ఝళిపిస్తుంటారు. ముఖ్యంగా వీరి లిస్టులో రెవెన్యూ అధికారులు ముందు వరుసలో ఉంటారు. గత కొంత కాలంగా తహసీల్దార్ల స్థాయిలో ఉన్న అధికారులే రంగంలోకి దిగి అవినీతికి పాల్పడుతున్నారు. జూన్ 5న బంజారాహిల్స్​లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఖలీద్ అనే వ్యక్తికి అనుకూలంగా స్టేట్​మెంట్ ఇచ్చేందుకు 15 లక్షల లంచం తీసుకుంటూ షేక్​పేట ఆర్​ఐ నాగార్జున రెడ్డి అనిశాకు చిక్కాడు.

తహసీల్దార్​ భర్త ఆత్మహత్య

ఈ కేసులో భాగంగా తహసీల్దార్ సుజాత ఇంట్లో తనిఖీ చేయగా 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీరితో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్​ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా సుజాత భర్త అజయ్ కుమార్​ను విచారించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన.. జూన్ 17న ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లి ఐదు అంతస్తుల భవనం మీది నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అజయ్ కుమార్ సోదరి ఆరోపించారు.

బెయిల్​కు నిరాకరించిన కోర్టు

కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అతన్ని అరెస్ట్​ చేసి చంచల్​గూడ జైలుకు తరలించారు. నాగరాజుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్​, అంజి రెడ్డి, వీఆర్ఏ సాయి రాజ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. దయారా గ్రామంలో 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి.. మ్యుటేషన్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు మాజీ తహసీల్దార్​తో పాటుగా 9 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుల్లో నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నాగరాజుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

టవల్​తో ఉరి వేసుకుని ఆత్మహత్య

నాగరాజు అక్టోబర్ 14 న జైలులోని కిటికి గ్రిల్​కు టవల్​తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నాగరాజు భార్య అన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో అరెస్టై, బెయిల్ పై బయటికొచ్చిన ధర్మారెడ్డి అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ పీఎస్ పరిధిలోని వాసవినగర్​లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణం చెందాడు.

24 ఎకరాల భూమికి నకిలీ పాసుపుస్తకాలు

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుతో చేతులు కలిపిన ధర్మారెడ్డి జులై 9న రాంపల్లిలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న 24 ఎకరాల భూమికి నకిలీ పాసుపుస్తకాలు తీసుకున్నాడు. ఈ కేసులో సెప్టెంబర్ 25వ తేదీన ధర్మారెడ్డిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇదే కేసులో ధర్మారాడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డితో పాటు.. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేట్, మరో ముగ్గురు స్థిరాస్తి వ్యాపారులను అనిశా అధికారులు సెప్టెంబర్ 29వ తేదీ అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. అనిశా కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వరుస ఆత్యహత్యలకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాశం గా మారింది.

ఇదీ చదవండి: హోర్డింగ్​ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.