డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి అనిశా వలలో చిక్కింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆమె.. రక్తనిధి సీఈవో నుంచి లంచం డిమాండ్ చేసింది. రక్తనిధికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.1.20 లక్షల విలువ చేసే బంగారు గొలుసు ఇవ్వాలని కోరింది. బంగారు గొలుసు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి లక్ష్మిని పట్టుకున్నారు. ఇదే వ్యవహారంలో గతంలో కూడా రూ.50వేలు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ చూడండి: ఐడియా అదుర్స్... మేకల నోటికి "హరిత" తాళం!