అదృశ్యమైందనుకున్న ఓ యువతి.. వివాహం చేసుకొని తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్, తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
స్థానిక సాయిబాబా కాలనీలో నివాసముంటున్న మంజు అనే యువతి.. టీచర్స్ కాలనీలోని ఓ పాఠశాలలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుంది. నిన్న ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆమె.. తనకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటూ ప్రిన్సిపల్‌కు ఓ లెటర్ రాసి ఇచ్చి అదృశ్యమైపోయింది.
ప్రిన్సిపల్ నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు.. ఆందోళన చెందారు. బంధువులను, స్నేహితులను ఆరా తీసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కట్ చేస్తే.. అదృశ్యమైన ఆ యువతి, ఓ వ్యక్తిని వివాహమాడి ఇంటికి తిరిగొచ్చింది. షాక్‌కు గురవ్వటం కుటుంబ సభ్యుల వంతైంది.
ఇదీ చదవండి: యువకుల కర్కశం... గిరిజన మహిళపై అత్యాచారం