హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ముంబయి నుంచి వచ్చిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు మద్యం తాగించి అత్యాచారం చేసి వీడియో తీశారని తెలిపింది. వీడియో అడ్డుగా పెట్టుకుని బెదిరిస్తున్నారని జూన్ నెలలో బాధితురాలు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేయగా ఈ ఘటన వెలుగు చూసింది. పుట్టిన రోజు వేడుకలకు హాజరైన యువతిని బలాత్కారం చేసిన నిందితుడు జుబేర్‌కు మరో ఇద్దరు యువతులు స్వీటీ, ప్రజక్తలు సహకరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం