ETV Bharat / jagte-raho

తండ్రి పెళ్లికెళ్లాడు.. దొంగ ఇంట్లోకెళ్లాడు - telangana news

ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటనలో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కూతురు వివాహం జరిపించడం కోసం కుటుబ సభ్యులతో స్వస్థలానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లో... సమీపంలోని యువకుడే చోరీకి పాల్పడ్డట్లు కనుగొన్నారు.

a young men theft in house in medchal malkajgiri
తండ్రి పెళ్లికెళ్లాడు.. దొంగ ఇంట్లోకెళ్లాడు
author img

By

Published : Jan 9, 2021, 9:50 PM IST

Updated : Jan 9, 2021, 10:37 PM IST

కూతురు వివాహం జరిపించడం కోసం కుటుంబ సభ్యులతో ఊరెళ్లిన వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డ యువకుడిని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ - మల్కాజ్​గిరి జిల్లా బాలానగర్​కు చెందిన రామారావు తన కూతురు వివాహం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వారి స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరని గమనించిన పరమేష్ అనే యువకుడు రాత్రి సమయంలో రామారావు ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ఏడు గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లాడు.

కూతురు వివాహం అనంతరం ఇంటికి వచ్చిన రామారావు.. తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరమేష్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: 650 కిలోల గంజాయి సీజ్​.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

Last Updated : Jan 9, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.