ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్న వాగులో యువకుడు గల్లంతయ్యాడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన యువకుడు స్నానం కోసం వాగులో దిగి నీట మునిగాడు.
హైదరాబాద్‌లోని గాయత్రి నగర్‌కు చెందిన భానుకు పదిరోజుల కిందట వివాహమైంది. కుటుంబంతో సహా సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చాడు. స్నానం చేద్దామని జంపన్నవాగులో దిగాడు. వాగులోని చెక్‌డ్యాం వద్ద నీట మునిగి గల్లంతయ్యాడు. యువకుడి కోసం కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.