ETV Bharat / jagte-raho

లాఠీ దెబ్బలు తాళలేక రోడ్డుపై పరిగెత్తాడు... - రాయచోటి నేరవార్తలు

విచారణలో భాగంగా పోలీసులు కొట్టిన లాఠీదెబ్బలు తాళలేక ఓ వ్యక్తి రహదారిపై పరుగులు తీశాడు. తనను కొట్టవద్దని బతిమాలుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను చూసేందుకు జనాలు గుమిగూడారు. కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో ఈ దృశ్యాలు వైరల్​ అయ్యాయి.

లాఠీ దెబ్బలు తాళలేక రోడ్డుపై పరిగెత్తాడు...

author img

By

Published : Dec 24, 2020, 9:17 PM IST

ఏపీలోని కడప జిల్లా రాయచోటి ప్రధాన రహదారి టోల్​గేట్ వద్ద పనిచేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కారణంతో... అదే మండలానికి చెందిన దామోదర్ యాదవ్​పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఏఎస్​ఐ లాఠీతో కొట్టడంతో దెబ్బలు తాళలేక ఠాణా ఎదుట ఉన్న జాతీయ రహదారిపైకి పరుగులు తీశాడు. తనను కొట్టవద్దని బతిమాలుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

బహిరంగ ప్రదేశంలో జరుగుతున్న ఈ ఘటనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరో వైపు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే స్టేషన్​కు పిలిపించామని, అప్పటికే దామోదర్ మద్యం సేవించాడని పోలీసుల తెలిపారు.

ఇదీచదవండి: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.