యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారానికి చెందిన నవనీత ఈ నెల 11 సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యలు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6 గంటలకు మరణించింది.
మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగుల సింహాద్రి కూతురు నవనీత.. రామారం గ్రామానికి చెందిన ముక్కా మహేశ్‌కు ఇచ్చి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ. 10 లక్షల కట్నం మాట్లాడుకుని రూ. ఆరు లక్షలు చెల్లించారు. ఒక సంవత్సరం బాగానే చూసుకున్న అత్త, మామ, భర్త మిగిలిన కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారని మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.