జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట్కు చెందిన తాల్లపెళ్లి ఇదయ్య గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదయ్య కుటుంబాన్ని సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ వ్యవస్థాపకుడు జక్కే వీరస్వామిగౌడ్ పరామర్శించారు. గీతకార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు కుందనపెళ్లి బుచ్చన్న గౌడ్, బొమ్మిడి గణపతి రాజ్ గౌడ్, ఇళ్లందకుంట మండల యూత్ ప్రధాన కార్యదర్శి తోడేటి రాకేష్ గౌడ్, గీత కార్మికులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి కేసీఆర్ లేఖ