ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో టోకరా... రాజకీయ నేత కుమారుడి ప్రమేయం! - job Froud in mahabubnager district

పోలీసు శాఖలో ఉన్నతాధికారి దగ్గర పనిచేస్తున్నానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని హన్వాడకు చెందిన వ్యక్తి అమాయకులను మోసం చేసిన వ్యవహారంలో పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. నిందితుడు హన్వాడకు చెందిన చంద్రశేఖర్‌ (చందు) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా జడ్చర్ల ఠాణాలో అతనిపై మంగళవారం కేసు నమోదైంది. ఇతడి మోసాలకు హన్వాడ మండలంలోని ఓ పార్టీ నేత కుమారుడితో పాటు మరో వ్యక్తి సాయం చేసినట్లు తెలుస్తోంది.

a political leader son Froud
ఉద్యోగాల పేరిట వసూళ్లకు ఓ పార్టీ నేత కుమారుడి సాయం
author img

By

Published : Oct 7, 2020, 11:04 AM IST

జడ్చర్లలో పనిచేసుకొంటున్న అలంపూర్‌కు చెందిన రాంబాబుకు కోర్టులో అటెండరు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చంద్రశేఖర్‌ దగ్గర రూ.6.50 లక్షలు వసూలు చేశాడు. ఇతని బంధువు, జడ్చర్లకు చెందిన బాలస్వామికి భూమి ఇప్పిస్తానంటూ రూ.2.65 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఇదే కుటుంబానికి చెందిన వనపర్తిలో ఉండే వ్యక్తి నుంచి హోంగార్డు ఉద్యోగం పేరిట రూ.1.50 లక్షలు వసూలు చేశారు. ఒకే కుటుంబంలోని ముగ్గురి నుంచి మొత్తం రూ.10.65 లక్షలు వసూలు చేశాడు. బాధితుడు రాంబాబు సోదరుడు నాగరాజు జడ్చర్ల ఠాణాలో నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.

రాజకీయ నేత కుమారుడి ప్రమేయం!

నిందితుడు చంద్రశేఖర్‌ హన్వాడ మండలానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నేత కుమారుడితో కలసి ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల పేరిట వసూలు చేయాలనుకున్న సొమ్మును రాజకీయ నేత కుమారుడి ఖాతాలో జమ చేయించేవారు. చంద్రశేఖర్‌కి హన్వాడకు చెంది మరో వ్యక్తి కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలసి ఖాతాలో జమ అయిన డబ్బును షాద్‌నగర్‌లో డ్రా చేసుకునేవారని సమాచారం. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా పోలీసుల అదుపులో ఉన్న నిందితులను జడ్చర్లకు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలిసింది. బుధవారం లేదా గురువారం నిందితుడిని, అతనికి సహకరించిన వారిని రిమాండుకు తరలించనున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారి పేరుతో బెదిరింపులు

‘మీ డబ్బులు ఎక్కడికీ పోవు.. త్వరలో మీకు ఉద్యోగాలు వస్తాయి. భూమి ఇప్పిస్తాం.. చందును వేధించొద్ధు అతనిపై కేసు పెడితే పుట్టగతులుండవు’ అంటూ ఓ ఉన్నతాధికారి పేరుతో బాధితులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలతో తాను మాట్లాడానని.. పని అయిపోతుందంటూ చరవాణిలో బాధితులతో చేసిన సంభాషణ రికార్డులను పోలీసులు సేకరించారు.

ఇవీ చూడండి: ఉద్యోగాలు, బదిలీల పేరుతో మోసం చేస్తున్న మహిళ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.