ETV Bharat / jagte-raho

బోయిన్​పల్లిలో ఓ వివాహిత అదృశ్యం - secunderabad crime news

వివాహిత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భావనకాలనీలో నివాసం ఉంటున్న నిఖిత అనే మహిళ ఆదివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బోయిన్ పల్లి పీఎస్​​లో ఫిర్యాదు చేశారు.

a married woman disappears in Bowenpally
బోయిన్​పల్లిలో ఓ వివాహిత అదృశ్యం
author img

By

Published : Nov 2, 2020, 10:52 PM IST

సికింద్రాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అదృశ్యం కేసు నమోదు అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బయటకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కర్ణాటకకు చెందిన నిఖితకు బాలాసాహెబ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. బోయిన్​పల్లిలోని భావనకాలనీలో నివాసం ఉంటున్నారు. కర్ణాటకకు వెళ్తానని ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

స్నేహితులు, బంధువులు, తెలిసినవారి ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. వెంటనే బోయిన్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిఖిత ఇంటి నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి: సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.