కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున హత్య జరిగింది. బీబీపేట్కు చెందిన బోయిని రాములు(35) తన వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురయ్యాడు. రాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంవత్సరం క్రితం జరిగిన ఆస్తి గొడవల్లో బోయిని రాములు తండ్రిని కొందరు హత్య చేశారు. ఇప్పుడు రాములు కూడా హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆస్తి గొడవలతోనే హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిని రాములుకు ఒక భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఇవీ చూడండి: అమానుషం: బాలికపై పైశాచికం... హత్యాచారయత్నం