కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి చెందిన అమరేష్, నాగప్పలు మేస్త్రీ పనులు చేసేవారు. 6 రోజుల కిందట నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భగవాన్పల్లిలో ఇల్లు కట్టేందుకు వచ్చారు. అమరేష్ బుధవారం రాత్రి మద్యం సేవించి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు పెంటగుంత నీటిలో పడిపోయాడు.
రాత్రి ఎవరూ గమనించకపోవడం వల్ల అందులోనే మృతి చెందాడు. ఈ ఘటనపై అమరేష్ పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.