ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లిలో జరిగింది.
రామగుండం ఎన్టీపీసీలో ప్రైవేటు ఉద్యోగులైన నల్ల తిరుపతి, ఎల్కపల్లి రాజేశం ద్విచక్రవాహనంపై మంథని నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్నారు. సింగిరెడ్డి పల్లి మూలమలుపు వద్ద వారి వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో తిరుపతి మృతి చెందగా... రాజేశం గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఉరేసుకొని యువతి ఆత్మహత్య.. విచారిస్తున్న పోలీసులు