మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు దాసరి మల్లయ్య(58). తన పంట పొలంలో బోర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఘటన స్థలంలో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఉరేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!