మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామ ఉపసర్పంచ్ శేఖర్... తన అన్నయ్య ఇంటిలో విద్యుత్ బోర్డు మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో శేఖర్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు.
హుటాహుటిన చెన్నూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శేఖర్ మృతితో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.