యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన పాండు అనే వ్యక్తి ఉపాధి కోసం ముంబాయి వెళ్లి... లాక్డౌన్ సమయంలో స్వగ్రామం తిరిగి వచ్చాడు. సంగెం గ్రామంలో ఉన్న బంధువులను కలవడానికి సాయంత్రం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
వలిగొండ మండలం సంగెం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటం వల్ల గాయాలపాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు