జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్యచేశాడు. గ్రామానికి చెందిన అరికెల లక్ష్మిని ఆమె భర్త సత్తయ్య గొంతుకోసి చంపాడు.
గత కొంతకాలంగా భార్యాభర్తలు గొడపడుతున్నారు. అయిదు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మరళా గొడపడి కిరాతకంగా అంతమొందించాడు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: అశ్లీల వెబ్‌సైట్‌తో విటులకు వల...3వేల మందికి టోపీ..!