కల్లు ఉద్దెర ఇవ్వనందుకు ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న కల్లు దుకాణానికి వెళ్ళాడు. ఉద్దెర అడగగా నిర్వాహకులు నిరాకరించారు. ఆవేశానికి గురైన అతడు కత్తితో ముగ్గురు విక్రయదారులపై దాడి చేశాడు. గాయపడిన రవి, జోగయ్య, రాజును సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఆ మరణాల లెక్కలు చెబితేనే కరోనా ప్రభావంపై స్పష్టత'