ETV Bharat / jagte-raho

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్త

ఆడపిల్ల పుట్టిందని ఓ మహిళను అత్తింటివారు వేధింపులకు గురిచేసిన సంఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. అమ్మాయి పుట్టిందనే కారణంతో తనను వదిలేసి వెళ్లిన భర్త ఇంటి మందు ఆందోళనకు దిగిన ఆ మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

a man assaulted his wife as she gave birth to a girl child in Hyderabad
ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్త
author img

By

Published : Jul 16, 2020, 8:15 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధిలోని శ్రీరామ్ నగర్​కు చెందిన జమీర్​కు.. సనత్​నగర్​ పరిధిలోని అల్లాపూర్​కు చెందిన ఆష్రా షర అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో పాప పుట్టగానే.. మళ్లీ ఆడపిల్లకే జన్మనిచ్చిందని అష్రాను ఆమె భర్త జమీర్, అతని కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు.

మరోసారి అమ్మాయే పుట్టిందని తనపై దాడి చేశారని ఆష్రా వాపోయింది. తనను వదిలేసి పరారైన భర్త జమీర్​పై, విచక్షణారహితంగా తనపై దాడికి పాల్పడిన అతని కుటుంబ సభ్యులపై ఆష్రా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇవీ చూడండి: ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు: భట్టి విక్రమార్క

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.