ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి - narayanapeta district crime updates

వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి గ్రామ చెరువులో ఓ వ్యక్తి విగతజీవిగా తేలిన ఘటన నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

a man accidentally fell into a pond and died at perapalla village in narayanapeta district
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 29, 2020, 7:56 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పేరపళ్ల గ్రామంలో చెరువులో పడి గోపాల్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన గోపాల్(49) బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఈ రోజు గ్రామ చెరువులో శవమై తేలాడు.

నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను చితక్కొట్టిన స్థానికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.