హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కార్మిక నగర్‌లో భారీ వర్షంతో ఓ ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కార్మిక నగర్‌లో అప్సర్ అనే వ్యక్తి తన ఇంట్లో భార్యా, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. ఇంటి పరిస్థితి బాగోలేక ఎప్పుడూ కూలుతుందో తెలియకపోవడంతో ప్రమాదాన్ని పసిగట్టి తన సోదరి ఇంటికి కుటుంబంతో సహా వెళ్లాడు. దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా ఇల్లు కూలిపోయిందని అప్సర్ తెలిపాడు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదనీ.. ప్రభుత్వం స్పందించి ఇల్లు నిర్మించాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి: సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీశ్ రావు