సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో మొయతుమ్మెద వాగు మత్తడి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తిని ఆరెపల్లి గ్రామానికి చెందిన కొంగ మల్లేష్‌గా గుర్తించారు.
మల్లేష్ మంచిర్యాలకి చెందిన వ్యక్తి కాగా అతని భార్య స్వరూప బస్వాపూర్‌లో ఏఎన్ఎమ్గా విధులు నిర్వహిస్తోంది. వీరిద్దరూ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఆరేపల్లి గ్రామంలో స్వరూప తండ్రి దగ్గర ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నాలుగు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మల్లేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని గ్రామస్థులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్లేష్ ఆత్మహత్యకి పాల్పడ్డాడా లేదా మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: క్షీణిస్తున్న గాలి నాణ్యత.. అన్‌లాక్‌తో పెరుగుతున్న కాలుష్యం