ETV Bharat / jagte-raho

గోడ కూలి బాలిక మృతి, ఇద్దరికి గాయాలు ఎమ్మెల్యే పరామర్శ

అభం శుభం తెలియని పిల్లలు.. ఇటుకలను తొలగించే క్రమంలో ఇంటి గోడ ఒక్కసారిగా కూలింది. ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి బాలిక మృతి చెందిన కుటుంబాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Two members injured as wall poster girl dies at baghlingampally
గోడ కూలి బాలిక మృతి ఇద్దరికి గాయాలు
author img

By

Published : Oct 12, 2020, 4:20 PM IST

Updated : Oct 12, 2020, 10:59 PM IST

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఇంటి గోడ కూలి బాలిక మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. సంజయ్​నగర్​లో జరిగిన ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో బాలిక, వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

సంజయ్​నగర్​లో నూతనంగా ఇంటిని నిర్మించుకునేందుకు జయకృష్ణ పురాతన ఇంటిని కూల్చి వేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నుంచే కూల్చివేత పనులు నిలిపివేశారు. ఇంటి ముందున్న ఇటుకల వల్ల రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని జయకృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు ఇటుకలను తొలగిస్తున్నారు.

ఆ క్రమంలో ప్రమాదవశాత్తు గోడ కూలడం వల్ల ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలైన విజయలక్ష్మి, దివ్యలను విద్యా నగర్​లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇంటి గోడ కూలి బాలిక మృతి చెందిన కుటుంబాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు.. విషయం తెలుసుకుని ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు హిమాయత్ నగర్ తహసీల్దార్​ లలిత, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గోడ కూలి బాలిక మృతి ఇద్దరికి గాయాలు

ఇదీ చూడండి : లైవ్ వీడియో: కారు బ్రేకులు ఫెయిల్​.. 4 వాహనాలు ధ్వంసం

Last Updated : Oct 12, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.