సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లిలో విషాదం జరిగింది. పశువు కోసం గడ్డి కోస్తుండగా విద్యుత్‌తీగలు తగిలి గ్రామానికి చెందిన తెరాస పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు, రైతు పర్సారాములు మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న మండల తెరాస పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు స్టీవాన్ రెడ్డి, సర్పంచ్ దార సత్యం, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి... రైతు కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతునికి పార్టీ సభ్యత్వం ఉన్నందున ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి సహాయం అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు సెల్ఫీ సూసైడ్