జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో సార సంజీవరెడ్డి అనే రైతు మృతి చెందారు.
గ్రామానికి చెందిన సంజీవరెడ్డి శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పారించడం కోసం మోటార్ పెట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల భార్య సుజాత పొలం వద్దకు వెళ్లింది. అప్పటికే సంజీవరెడ్డి విద్యుదాఘాతంతో మోటార్ వద్ద పైపునకు ఆనుకుని మృతి చెంది ఉన్నాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవీ చూడండి: విషాదం: కరెంట్‌షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి