ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, గేటు రేలకాయలపల్లిలో తెల్లవారుజామున పిచ్చికుక్క స్వైరవిహారం కారణంగా గ్రామంలోని పలువురికి గాయాలయ్యాయి. కుక్క దాడిలో గాయపడిన 9 మంది క్షతగాత్రులు కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధికుక్కల నుంచి తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: విషాదం: పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి