ETV Bharat / jagte-raho

ఆయనకు తెలియకుండానే రూ.6లక్షలు లోన్‌ ఎలా తీశారు? - హైదరాబాద్ సైబర్ క్రైం కేసులు

ఓ వ్యక్తి సిబిల్‌ రిపోర్ట్‌ చూసుకున్నాడు. అందులో స్కోర్‌ చాలా తక్కువ ఉంది. ఏంటా అని ఆరా తీశాడు. అతని పేరుతో ఆరు బ్యాంకుల్లో లక్ష చొప్పున మొత్తం రూ.6లక్షలు రుణం తీసుకున్నట్లు ఉంది. ఆ మొత్తాలు చెల్లించకపోవడంతో డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. ఆ సమాచారంతో షాక్‌ అయిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అతని ప్రమేయం లేకుండా లోన్‌ ఎలా వచ్చింది?

cyber crime
cyber crime
author img

By

Published : Sep 30, 2020, 6:31 PM IST

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు అతడి ఆరు బ్యాంకుల నుంచి ఆరు లక్షల రుణం తీసుకున్నారు. సిబిల్ స్కోర్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులో వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి... ఇటీవల ఆయన తన సిబిల్ రిపోర్ట్ చూసుకున్నారు. అందులో స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో ఆరా తీశాడు.

సునీల్ ఆరు బ్యాంకుల్లో లక్ష చొప్పున రుణం తీసుకున్నట్లు...ఆ మొత్తాలు చెల్లించకపోవడంతో డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. అయితే ఈ రుణాల విషయం తనకు తెలియదంటూ సునీల్ వాపోయాడు. బాధితుడి పాన్‌కార్డ్‌తో సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్ లోన్ సదుపాయంతో ఈ రుణాలు పొందారని వెల్లడైంది.

బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది... రుణం ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది... తదితర అంశాలు పోలీసులు ఆరా తీయనున్నారు.

ఇదీ చదవండి : మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.