ETV Bharat / jagte-raho

6 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

6 crore worth of narcotics seized in Hyderabad
6 కోట్ల విలువై6 crore worth of narcotics seized in Hyderabadన మత్తు పదార్థాలు స్వాధీనం
author img

By

Published : Aug 19, 2020, 5:40 PM IST

Updated : Aug 19, 2020, 7:11 PM IST

17:38 August 19

6 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

హైదరాబాద్‌ నగర శివారులోని ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో మరో ఆరు కోట్లు విలువైన 52.5 కిలోల మాదక ద్రవ్యాలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన అయిదు రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు తయారీకి ఉపయోగిస్తున్న కంపెనీతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.

పోలీసులు కాని, డీఆర్‌ఐకాని, కస్టమ్స్‌కాని, ఎక్సైజ్‌కాని ఏ ఏజన్సీ దాడులు చేసినా కనిపించకుండా ఉండేందుకు వీలుగా మత్తుమందులను భూమిలో పాతిపెట్టినట్లు ఈ బృందాలు గుర్తించాయి.  ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్న బృందాలు నిన్న రాత్రి పూడ్చి పెట్టిన ప్రదేశాన్ని తవ్వి ఈ మాదక ద్రవ్యాలను అధికారులు వెలికి తీశారు.

ఇందులో ఎపిడ్రిన్‌ 45కిలోలు, మెఫెడ్రోన్‌ 7.5కిలోలు ఉన్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు ఆరు కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు వివరించారు. మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

Last Updated : Aug 19, 2020, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.