ETV Bharat / jagte-raho

ములుగు జిల్లా కేంద్రంలో 54 కిలోల గంజాయి పట్టివేత - mulugu latest crime news

ములుగు జిల్లా కేంద్రంలో పందికుంట క్రాస్ రోడ్డు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. 54 కిలోల గంజాయి, ఒక మోటార్​ సైకిల్​, రెండు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ములుగు ఏఎస్పీ పి.సాయి చైతన్య హెచ్చరించారు.

54 kgs ganja seized at mulugu district and two people arrested
ములుగు జిల్లా కేంద్రంలో 54 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Nov 1, 2020, 6:14 PM IST

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ములుగు జిల్లా కేంద్రంలో పందికుంట క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్​ చేశారు. 27 ప్యాకెట్లలో ఉన్న 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,32,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్, రెండు చరవాణులను సీజ్​ చేశారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ములుగు ఏఎస్పీ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదని హితవు పలికారు. గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని.. సరఫరా చేస్తున్న వారి గురించి ప్రజలు పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ములుగు ఎస్ఐ, సిబ్బంది పందికుంట క్రాస్ రోడ్ సమీపంలో గస్తీ నిర్వహిస్తుండగా ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒకే మోటర్ సైకిల్​పై రెండు సంచులు పెట్టుకొని అనుమానంగా కనిపించారు. పోలీసులని చూసి వారు పారిపోవడానికి ప్రయత్నిచగా.. వెంబడించి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. మరో వ్యక్తి పారిపోయాడు. వారి వద్ద నుంచి ఒక్కో ప్యాకెట్​ రెండు కేజీల బరువు గల 27 సంచులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏఎస్పీ సాయితోపాటు సీఐ కె.దేవేందర్ రెడ్డి ఎస్ఐలు హరికృష్ణ, ఫణి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.