ETV Bharat / jagte-raho

తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు - telangana news

తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం కూలీ బతుకులను ఛిద్రం చేసింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాల్లో ఆ దుర్ఘటన విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లాలో ఉదయం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

vikarabad accident
vikarabad accident
author img

By

Published : Dec 26, 2020, 2:33 PM IST

Updated : Dec 26, 2020, 6:24 PM IST

తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలితీసుకుంది. ఆగి ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరొకరు చనిపోయారు. తాండూరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సంగారెడ్డి నుంచి తాండూరుకు వస్తున్న లారీ... ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన కూలీలు శేణీబాయి, సంధ్య, నితిన్, సోనాబాయి, రేణుకాబాయిగా పోలీసులు గుర్తించారు.

పొగమంచు కారణమా?

అతివేగం, పొగమంచే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారని... పనిచేస్తేనే పూట గడుస్తుందని తెలిపారు. చనిపోయిన వారంతా దగ్గరి బంధువులని పేర్కొన్నారు. మృతుల్లో చదువుకునే పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా... ఆర్​ అండ్‌ బీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

బాధ్యులపై కఠిన చర్యలు

ప్రమాదస్థలిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. స్థానికుల ఫిర్యాదుతో ఆర్​ అండ్‌ బీ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా బాధితులకు కొంత డబ్బును అందించారు.

మంత్రి సబితా ఆరా

ఈ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : పాత కక్షలతో కాల్పులు: ఆదిలాబాద్​ ఘటనలో వ్యక్తి మృతి

Last Updated : Dec 26, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.