నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన ముత్యాలు, గోపాల్, లింగమ్మ, అంజమ్మ ద్విచక్రవాహనంపై కల్వకుర్తి నుంచి ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్చాల సమీపంలో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన వేసిన రక్షణ కంచెను వేగంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ముత్యాలు వాహనంపై ఉన్న ఐదేళ్ల చిన్నారి అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి, లింగమ్మ, గోపాల్ గాయపడ్డారు. గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించి వీరు కల్వకుర్తిలోని జరిగిన సంత చూసుకొని మాదారం వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.