ETV Bharat / jagte-raho

ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్​ - cricket betting in hyderabad

ఆన్​లైన్​లో ఐపీఎల్​ క్రికెట్​ మ్యాచ్​లకు బెట్టింగ్​ నిర్వహిస్తున్న నిందితున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. డబ్బుల కలెక్షన్​ కోసం పెట్టుకున్న ఇద్దరు సహాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

3 arrested for ipl cricket betting in hyderabad

author img

By

Published : Oct 3, 2020, 12:36 PM IST

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5లక్షల 60 వేల నగదు, 5 చరవాణీలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాంకోఠిలో ఆటోమొబైల్ దుకాణ యజమాని మహేంద్ర కుమార్ ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఆన్​లైన్ ద్వారా పలువురి నుంచి బెట్టింగ్ స్వీకరిస్తున్నాడు.

3 arrested for ipl cricket betting in hyderabad
ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్​

ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసుకొని డబ్బులు కలెక్షన్ చేయిస్తున్నాడు. రాజేంద్రనగర్​లోని ఉప్పరపల్లిలో డబ్బులు తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహేంద్ర కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: వాట్సప్​ స్టేటస్​లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.