ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదాల నివారణపై అన్వేషణ

వికారాబాద్​ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇందుకు గల కారణాలను పరిశీలించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా మలుపులు, అతివేగం, హెచ్చరిక బోర్డులు లేకపోవడమేనని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగానే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని రహదారి భద్రత కమిటీ ప్రతిపాదించిన అంశాలను పాలనాధికారిణికి నివేదించడంతో సత్వరం అమలు చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ శాఖ పరిధిలో ఉన్న రహదారులకు వారే బాధ్యులుగా పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

29 block spots identified in vikarabad district
రోడ్డు ప్రమాదాలకు గల కారణాల అన్వేషణ.. నివారణకు కార్యాచరణ
author img

By

Published : Jan 29, 2021, 9:44 AM IST

వికారాబాద్​ జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 930 కిలోమీటర్లు, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో వెయ్యి కిలోమీటర్లు ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్ర, జాతీయ రహదారులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపైనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణాలను అన్వేషించారు. ఈ ప్రక్రియలో భాగంగా 28 ప్రాంతాల్లో బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. ఇందులో మన్నెగూడ-రావులపల్లి వరకు మొత్తం 17 ఉండటం గమనార్హం. విస్తరణ, అభివృద్ధి చేశాకే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారులపైనా జరుగుతున్న ప్రమాదాలపై చర్చించారు.

చేపట్టాల్సిన పనులు ఇవి..

వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు , శిరస్త్రాణం ధరించేలా చర్యలు తీసుకోవడం. జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలని నిర్ణయించారు. ఫలితంగా వాహన చోదకుడు వేగాన్ని తగ్గించి, చుట్టుపక్కల వాహనాలను గమనించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు (సైన్‌ బోర్డులు), దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లైట్స్‌ను ఏర్పాటు చేయాలి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడం, కార్లలో సీటు బెల్టు, ఇతర మోటారు వాహన చట్టంలోని నిబంధనలు అమలు చేయడం. ఈ మూడింటిని అమలు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని రహదారి భద్రత కమిటీ సూచించింది.

ఎక్కడెక్కడ..

చన్‌గోముల్‌, మన్నెగూడ, పూడూరు, పరిగి పట్టణం, తుంకిమెట్ల కూడలి, కొడంగల్‌, ఇందనూర్‌, రావుపల్లి, చిట్లపల్లి గేటు, తదితర ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా ప్రకటించారు. పంచాయతీరాజ్‌, రహదారులు, భవనాల శాఖ, రాష్ట్ర రహదారుల్లో తాండూరు, యాలాల మండలం నారాయణపూర్‌ కూడలి, కరణ్‌కోట్‌, నవాబుపేట మండలం మారేపల్లి గేటు, మంబాపూర్‌ గేటు, కండ్లపల్లి మలుపు ఇలా మరికొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా పేర్కొన్నారు. దీంతో తక్షణం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పోలీసు, రవాణా, రహదారుల శాఖల అధికారులతో సమీక్షించిన మీదట పలు సూచనలు, సలహాలను ప్రతిపాదించారు.

సమీక్షించి ప్రతిపాదించాం..

జిల్లాలో రహదారి ప్రమాదాలపై సమీక్షించి నివారణ చర్యలను ప్రతిపాదించారు. బ్లాక్‌ స్పాట్లను గుర్తించాం. తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందించాం. ఆమె స్పందిచి సత్వరం ఆయా పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. - భద్రునాయక్‌, జిల్లా రవాణా శాఖాధికారి.

ఇవీ చూడండి: 'కొవిడ్​ టీకాతో ఇప్పటిదాకా దుష్ఫలితాలేమీ లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.