నాటు సారా తాగిన వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో జరిగింది. గ్రామానికి చెందిన 25 మంది శనివారం రాత్రి నాటు సారా తాగారు.
కొంతసేపటికే వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 23 మంది బాధితులు స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందారు.
ఇదీ చదవండి: సాగు భూముల్లో ప్రకృతివనం.. లబోదిబోమంటున్న రైతాంగం!