ETV Bharat / jagte-raho

నాటుసారా తాగి 25 మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం - నాటుసారా తాగి అస్వస్థత

నాటుసారా తాగి 25 మంది అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సిరిమామిడిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం జీజీహెచ్​లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 23 మంది కోలుకోవటంతో ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపించారు.

నాటుసారా తాగి 25 మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

author img

By

Published : Dec 27, 2020, 6:11 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో నాటుసారా తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్​కు తరలించారు. వీరి పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన మిగిలిన 23 మంది బాధితులకు చికిత్స అందించి ఇళ్లకు పంపించారు.

నాటుసారా తాగి 25 మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

పోలీసుల ఆరా..

ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోవటంతో ఆ కార్యక్రమానికి హాజరైన 25 మంది నాటు సారా సేవించారు. కొద్దిసేపటికే వీరు రక్తపు వాంతులు చేసుకున్నారు. అయితే నాటు సారా ఎక్కడినుంచి తెప్పించారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి వస్తున్న నాటుసారాను ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస మండలాల్లో జోరుగా విక్రయిస్తున్నారు. అక్కడినుంచే నాటుసారా తెప్పించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: గిఫ్ట్​ల ఎర చూపి... ఆస్తులమ్ముకునేలా చేస్తారు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.