ETV Bharat / jagte-raho

ఇందిరా పార్కులో అర్ధరాత్రి.. 13 శ్రీగంధం చెట్ల నరికివేత

హైదరాబాద్​ నగరం నడిబొడ్డునున్న ఇందిరాపార్కులో దొంగలు పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి 13 శ్రీగంధం చెట్లను నరికారు. ఆటోలో దుంగలను తరలించుకుపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షలాది రూపాయలు విలువ చేసే చెట్ల నరికివేత ఇంటి దొంగల పనే అని ఇందిరాపార్కు వాకర్లు ఆరోపిస్తున్నారు.

13 sandalwood trees were cut down at Hyderabad Indira Park at midnight
ఇందిరాపార్కులో అర్ధరాత్రి 13 శ్రీగంధం చెట్ల నరికివేత
author img

By

Published : Nov 12, 2020, 7:53 AM IST

హైదరాబాద్​ ఇందిరా పార్కులో 460 శ్రీగంధం చెట్లు ఉండగా... పార్కు 1975లో నిర్మాణమైంది. నగరం మధ్యలో 76 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానం నిత్యం మూడు వేల మంది సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇంత ప్రాధాన్యమున్నా ఒక్క సీసీ కెమెరా లేదు. జీహెచ్‌ఎంసీ అధికారుల కార్యాలయం కోసం రామకృష్ణ మఠం వైపు ఓ ద్వారం, సందర్శకుల కోసం ధర్నాచౌక్‌ ముందు మరో ద్వారం ఉంటాయి. ఓ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల క్రితం 360 శ్రీగంధం మొక్కలు నాటారు. క్రమంగా వాటి సంఖ్య 460కి పెరిగింది. పదేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చెట్లను నరికి దుంగలను తీసుకెళ్లారు. కేసు నమోదు చేసినా ఫలితం లేకపోయింది.

భద్రత లేదు..

ట్యాంక్‌బండ్‌కు కూతవేటు దూరంలో, ధర్నాచౌక్‌, రామకృష్ణమఠం వంటి రద్దీ ప్రాంతాల పక్కన ఉండటంతో నిత్యం వేలాది మంది పార్కును సందర్శిస్తారు. భద్రత కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని వాకర్ల సంఘం నేతలు చాలా సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీని అభ్యర్థిస్తున్నా స్పందన కరవైంది.

విచారణ సాగుతోంది..

‘‘గ్రేడు ‘బీ’ రకానికి చెందిన గంధం చెట్ల దుంగలను నరికి తీసుకెళ్లినట్లు జీహెచ్‌ఎంసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. బయటి మార్కెట్లో ఆ దుంగల ఖరీదు రూ.1.5 లక్షలని, వాటి బరువు 75 కిలోలు ఉంటుందని, 12 అడుగుల ఎత్తున చెట్లు నరికి 6 అడుగుల దుంగలను తస్కరించినట్లు బల్దియా చెప్పింది. రామకృష్ణమఠం రోడ్డులోని ఎమరాల్డ్‌ మిఠాయి దుకాణం వద్దనున్న పార్కు ద్వారం నుంచి దుండగులు దుంగలను తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోడ్డు మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం.’’అని మధ్యమండలం డీసీపీ పి.విశ్వప్రసాద్‌ తెలిపారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.