భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మద్యం మత్తులో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. పట్టణంలోని పలు చోట్ల 13 కార్ల అద్దాలను పగులగొట్టారు. సింగరేణి నిర్వాసితుల కాలనీ, పట్టణంలో జరిగిన ఈ ఘటనను ఉదయం సమయంలో పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ఎంపీ