మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీలకు చెందిన రెండు లాకర్లను అనిశా అధికారులు తెరిచారు. అల్వాల్, మేడ్చల్ ఐసీఐసీఐ శాఖల్లో నాగరాజుకు చెందిన లాకర్లను తెరిచిన అధికారులు అందులో 1,250 గ్రాముల బంగారం, 7.2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు ఆస్తి పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు.
అల్వాల్‌లోని లాకర్‌ను నందగోపాల్ పేరు మీద, మేడ్చల్‌లోని లాకర్‌ను మహేందర్ పేరు మీద ఉన్నట్లు అనిశా అధికారులు తేల్చారు. ఈ రెండు లాకర్లను కూడా నాగరాజు భార్య స్వప్న నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నాగరాజు స్నేహితుడైన నందగోపాల్, ఆయన సోదరుడు మహేందర్‌ను ఒప్పించి.. ఐసీఐసీఐ బ్యాంకుల్లో లాకర్లు తెరిచాడు. మహేందర్ ఐసీఐసీఐ బ్యాంకులోనే పనిచేస్తున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఈ రెండు ఆస్తుల పత్రాలకు సంబంధించి అనిశా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆస్తులు ఎక్కడున్నాయి. వీటి మార్కెట్ విలువ ఎంత అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీచూడండి: ఒక్కొక్కరుగా బయటకొస్తున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీలు