ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో 12 ఏళ్ల బాలికపై ఆదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఇంట్లో ఉన్న బాలికకు నోట్లో గుడ్డలు కుక్కి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి.. నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వివేకా హత్యకేసు: సెటిల్మెంట్లు, స్థిరాస్తి గొడవలపై సీబీఐ ఆరా