హైదరాబాద్ పాతబస్తీలో కాలపత్తర్ పీఎస్ పరిధిలో ఈనెల 19, 20 తేదీ అర్ధరాత్రి జరిగిన శానుర్ హత్య కేసులో ఓ మైనర్ బాలుడితో సహా మొత్తం 10 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు కత్తులు, 2 ద్విచక్రవాహనాలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన మహమ్మద్ ఆర్బాజ్ అనే ప్రధాన నిందితుడు హత్యకు గురైన శానుర్ రౌడి షీటర్ మధ్య పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు.
ఈనెల 19, 20 తేదీ మధ్యరాత్రి శానుర్ ఇంటి వద్ద ఉండగా.. ఆర్బాజ్ అతని సహచరులతో కలిసి కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసి పారిపోయారు. రక్తపు మడుగులు ఉన్న శానుర్ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా... అదే రాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇవాళ 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.