ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి పన్నెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ పరిధిలోని బొగ్గుల కింది తండాకి చెందిన భూక్య హంసి, ప్రకాశ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు శివ కోనరావుపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో చదువుతున్నాడు.
గ్రామంలోని ఓ రైతుకు సంబంధించిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో పోసుకొని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువస్తుండగా... సరదా కోసం ట్రాక్టర్ పైకి ఎక్కిన శివ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అజాగ్రత్తగా నడిపినందువల్లే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఐ బన్సీలాల్ చొరవ తీసుకొని వారిని శాంతింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ