ETV Bharat / international

అమెరికా-ఇరాన్​ యుద్ధం వస్తే భారత్​కు ఎలా నష్టం? - అంతర్జాతీయ వార్తలు

అమెరికా-ఇరాన్​ మధ్య సులేమానీ హత్యతో మొదలైన తీవ్ర ఉద్రిక్తతలు... ఈ రోజు ఇరాక్​లో జరిగిన ఇరాన్​ ప్రతీకార దాడితో మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తితే పరిణామాలు ఎలా ఉంటాయి? వాటితో భారత్​కు కలిగే నష్టం ఏమిటి? అసలు అమెరికా-ఇరాన్​ మధ్య ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

us iran
us iran
author img

By

Published : Jan 8, 2020, 4:49 PM IST

Updated : Jan 8, 2020, 6:04 PM IST

ఖుద్స్ ఫోర్స్ కమాండర్​ ఖాసీం సులేమానీ హత్యతో అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్​.. ఇరాక్​లోని​ అమెరికా వైమానిక స్థావరాలపై ఈ రోజు 22 రాకెట్లతో దాడి చేసింది.

ఈ ప్రతీకార దాడితో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ఆవరించాయి. అయితే ఈ దాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. జరిగిన దాడిని పూర్తిగా అధ్యయనం చేసి రేపు భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడుతానని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ స్పందన తర్వాత.. ఎదురుదాడికి పాల్పడితే మరిన్ని అమెరికా స్థావరాలపై దాడులు చేపడుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ పరిస్థితులపై జోర్డాన్, లిబియా, మాల్టాలో భారత రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణయత్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగినప్పటి తర్వాతనే అమెరికా-ఇరాన్​ మధ్య వాతావరణం వేడేక్కిందని చెబుతున్నారు.

పునాది అక్కడే..

అమెరికా అధ్యక్షుడిగా బరాక్​ ఒబామా.. ఇరాన్​తో సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ) పేరుతో చారిత్రక అణు ఒప్పందం కుదుర్చుకుని గొప్ప విజయాన్ని సాధించారు. గతంలోని ఆంక్షలను సడలిస్తూ ఇరాన్​ అణు అవసరాలను తీర్చే విధంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇక్కడే రెండు దేశాల మధ్య అంతరానికి పునాది పడింది.

ట్రంప్ వ్యూహాలు..

అణు ఒప్పందం నుంచి వైదొలిగనప్పటి తర్వాత ఇరాన్​ను లొంగదీసుకునేందుకు ట్రంప్ రాక్షస ప్రయత్నమే చేశారు. వివిధ వ్యూహాలు, విస్తృత ఆంక్షలతో ఇరాన్​పై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఇరాన్​కు సంబంధించి అంతర్గత, విదేశీ వివాదాలను అనుకూలంగా మార్చుకుంది అమెరికా.

షియా-సున్నీ వర్గాల మధ్య ఇప్పటికే తీవ్రంగా ఉన్న అంతరాన్ని అస్త్రంగా వాడుకున్నారు. అస్థిత్వ పోరులో సౌదీ అరేబియాతో ప్రత్యక్షంగా , ఇజ్రాయెల్​తో పరోక్షంగా ఉన్న ఇరాన్​ వైరాన్ని మరో ఆయుధంగా మలుచుకుంది అమెరికా.

కుష్నర్​ నేతృత్వంలో...

ట్రంప్ సలహాదారు జారెడ్ కుష్నర్​ నేతృత్వంలో ఇజ్రాయెల్​కు గల్ఫ్ దేశాలతో సయోధ్య ఏర్పడినా.. ఇరాన్​తో మాత్రం వైరం మరింత ముదిరింది. ఇది పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిరతకు దారి తీసింది. ఈ మార్పు ఇరాన్​ ప్రభావం స్పష్టంగా కనిపించే దేశాల్లో ఎన్నో వివాదాలకు కారణమైంది.

ఈ పరిణామాలతో లిబియా, యెమెన్, ఇరాక్, సిరియా, గాజా, లెబనాన్​ తదితర దేశాలు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా మారాయి. మరోవైపు ఇరాక్​లోని రాజ్యేతర శక్తులైన హిజ్బుల్లా, హమాస్​, హౌతీస్, షియా మిలిషియా.. ఇరాన్​కు దగ్గరయ్యాయి.

ఈ సంఘటనలు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతికూల వాతావరణానికి దారి తీసింది. చమురు సరఫరా, వాణిజ్యానికి కీలకమైన హొర్మూజ్ జలసంధిలో ఎన్నో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా డ్రోన్ల కూల్చివేత, వాణిజ్య ఓడలు, సౌదీ చమురు కేంద్రాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో ప్రతిదాడులు జరగకపోవటం ఒకరకంగా అదృష్టంగానే భావించాలి.

హొర్మూజ్​లో వరుస పరిణామాల తర్వాత కొంత నిశబ్దం ఆవిరించింది. రెండు దేశాల మధ్య సయోధ్య కోసం వివిధ దేశాల కృషితో మధ్యమార్గం ఏర్పడుతున్నట్లు కనిపించింది. ఈ సమయంలోనే అమెరికా కాంట్రాక్టర్​ను మిలీషియా గ్రూపు చంపటం.. వెంటనే సులేమానీని మట్టుబెట్టాలని ట్రంప్​ ఆదేశాలు ఇవ్వటం.. అంచనాలను తలకిందులు చేసింది.

అమెరికా చర్య సరైనదేనా?

సులేమానీ మరణం తర్వాత ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఉగ్రవాదం కోసం సులేమానీ చేస్తున్న ప్రచారానికి ట్రంప్ ముగింపు పలికారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమర్థించారు.

అయితే ప్రభుత్వ హోదాలో ఉన్న వారిపై విదేశాలు దాడి చేసి చంపటం హద్దును అతిక్రమించటమే అవుతుంది. ఇది ఇరానీయులను విస్మయంతో పాటు బాధకు గురిచేసింది. సులేమానీ అంత్యక్రియల్లో లక్షలాది మంది పాల్గొని అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేయటమే ఇందుకు నిదర్శనం. ఇరాన్​ అగ్రనేతలూ తీవ్రమైన ప్రతీకార హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం ట్విట్టర్​లో ప్రారంభమైన మాటల యుద్ధం.. జరగబోయే ఘోర పరిణామాలను ముందే హెచ్చరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త పడిన ఇరాక్...​ అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పౌరులను పంపించేందుకు ఆ దేశ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. అమెరికా ఈ చర్యతో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి, భౌగోళిక వ్యూహాత్మక తప్పిదం చేసిందని ఇరాక్ ఆరోపించింది.

అమెరికా ఎలా స్పందిస్తుంది?

ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అయితే అది అంతే స్థాయిలో ఉండాలని లేదు. అయినప్పటికీ ప్రతీకారానికి ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై దాడి ప్రపంచ దేశాలను ఖిన్నులను చేసింది.

ఇప్పటివరకు పశ్చిమాసియా ప్రాంతంలో బలగాల కొనసాగింపుపై అమెరికాలో సందిగ్ధం ఉండేది. అఫ్గానిస్థాన్​ నుంచి సిరియా వరకు తమ సైన్యాన్ని ఉపసంహరించాలని చూసింది. అయితే తాజా పరిస్థితులు, గతంలో జరిగిన కొన్ని ఘటనలను బట్టి ఆ దేశ ప్రయోజనాలను కాపాడుకోవటం అమెరికాకు ముఖ్యం. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో అమెరికా సైనిక ప్రాబల్యం కొనసాగించాలనే డిమాండ్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికా మిత్రపక్షాలు మాత్రం ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా రెండు పక్షాలు సహనం పాటించాలని సూచించాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచానికి ఇంధనాన్ని అందించే ప్రాంతంలో అస్తిత్వం, అధికారం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం జరిగే పోరుతో ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడనుంది.

జరిగే నష్టాలేంటి?

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగే చమురు ధరలు అమెరికా సహా కొంతమందికి లాభించినా.. స్నేహపూర్వక ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటికీ.. రెండు దేశాల అధినేతలు సహకరిస్తే ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనే అవకాశం లేకపోలేదు. అయితే రాజ్యేతర శక్తులు కయ్యానికి కాలు దువ్వే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

భారత్​పై ప్రభావం ఎంత?

అమెరికా-ఇరాన్​ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు.. భారత్​కు ఆందోళన కలిగించేవే. ఇతర దేశాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న భారతీయులు, ఇంధన సరఫరా, ఇరు పక్షాలతో భాగస్వామ్యం వంటి అంశాలు ప్రతిబంధకంగా మారుతాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిస్థితులపై అమెరికాతోపాటు ఇరాన్​, ఓమన్​ దేశాలతో భారత విదేశాంగ మంత్రి చర్చించారు.

వచ్చే వారం ఇరాన్​ విదేశాంగ మంత్రి జావద్ జరిఫ్.. రైజీనా సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. అంతకుముందే దిల్లీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశముంది.

ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా చూసేందుకు భాగస్వామ్యపక్షాలన్నీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే... అవి ఎంత వరకు సఫలమవుతాయన్నదే అసలు ప్రశ్న.

(రచయిత-అనిల్​ త్రిగుణయత్​, వివిధ దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు)

Kullu (Himachal Pradesh), Jan 08 (ANI): Himachal Pradesh's Kullu received heavy snowfall on Jan 08. The hilly area was covered in a thick blanket of snow. With the fresh spell of snow, temperature dipped further. Snowfall is expected to continue in Himachal Pradesh for couple of days.
Last Updated : Jan 8, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.